పరాక్రమం అందరికీ నచ్చుతుంది

ABN , Publish Date - May 27 , 2024 | 01:07 AM

బండి సరోజ్‌ కుమార్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పరాక్రమం’. శ్రుతి సమన్వి, నాగలక్ష్మి కథానాయికలు. బీఎస్‌కే మెయిన్‌ స్ట్రీమ్‌ బేనర్‌ నిర్మించింది. శనివారం ఈ చిత్రం...

పరాక్రమం అందరికీ నచ్చుతుంది

బండి సరోజ్‌ కుమార్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పరాక్రమం’. శ్రుతి సమన్వి, నాగలక్ష్మి కథానాయికలు. బీఎస్‌కే మెయిన్‌ స్ట్రీమ్‌ బేనర్‌ నిర్మించింది. శనివారం ఈ చిత్రం టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని యూనిట్‌ నిర్వహించింది. హీరో విష్వక్‌సేన్‌ టీజర్‌ను విడుదల చేసి, సినిమా ఘన విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సరోజ్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘చిరంజీవి గారి స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. నటుడిగా నిరూపించుకునే ప్రయత్నంలో దర్శకుడిగా మారాను. ‘పరాక్రమం’ సినిమాను ఒక యజ్ఞంలా చేశాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అని చెప్పారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రాధాన్యం ఉన్న పాత్ర పోషించినట్లు శ్రుతి సమన్వి చెప్పారు.

Updated Date - May 27 , 2024 | 01:07 AM