We Love Bad Boys: వాలెంటైన్స్‌ డే స్పెషల్.. ఫస్ట్ లుక్ విడుదల

ABN , Publish Date - Feb 14 , 2024 | 02:58 PM

బి.ఎమ్. క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీమతి పప్పుల వరలక్ష్మి సమర్పణలో పప్పుల కనక దుర్గారావు నిర్మిస్తున్న చిత్రం ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’. రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ నుండి యుబైఏ సర్టిఫికేట్ సొంతం చేసుకుని త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. కడుపుబ్బే ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను వాలెంటైన్స్ డే స్పెషల్‌గా చిత్ర బృందం విడుదల చేసింది.

We Love Bad Boys: వాలెంటైన్స్‌ డే స్పెషల్.. ఫస్ట్ లుక్ విడుదల
We Love Bad Boys First Look

బి.ఎమ్. క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీమతి పప్పుల వరలక్ష్మి సమర్పణలో పప్పుల కనక దుర్గారావు నిర్మిస్తున్న చిత్రం ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’ (We love Bad Boys). రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సెన్సార్ నుండి యుబైఏ సర్టిఫికేట్ సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే మేకర్స్ థియేటర్లలో విడుదల చేయనున్నారు. కడుపుబ్బే ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను వాలెంటైన్స్ డే స్పెషల్‌గా చిత్ర బృందం విడుదల చేసింది.

అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ, రోషిణి సహోట, ప్రగ్యా నయన్, సన్యు దవలగర్, వంశీకృష్ణ, సింధు విజయ్, విహారిక చౌదరి ముఖ్య తారాగణం. పోసాని, కాశి విశ్వనాథ్, అలి, సప్తగిరి, పృథ్వి, శివారెడ్డి, భద్రం, గీతాసింగ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నేటి ట్రెండ్‌కు తగిన కథ-కథనాలతో ఆద్యంతం నవ్వించే కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్ర దర్శకులు రాజు రాజేంద్ర ప్రసాద్ చెబుతున్నారు. (We Love Bad Boys First Look)


Bad-boys.jpg

సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తమ బ్యానర్‌కు శుభారంభాన్ని ఇస్తుందనే నమ్మకంతో ఉన్నామని నిర్మాత పప్పుల కనక దుర్గారావు అన్నారు. అతి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తో దాదాపు అన్ని పాత్రల నటీనటులను పరిచయం చేయడం విశేషం. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రఘు కుంచెతో కలిసి భూషణ్ జాన్ సంగీతం అందిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని శ్రీమతి పప్పుల వరలక్ష్మి సమర్పిస్తున్నారు.

Updated Date - Feb 14 , 2024 | 03:06 PM