గుండెపోటుతో ఉషా ఉతప్‌ భర్త కన్నుమూత

ABN , Publish Date - Jul 10 , 2024 | 01:21 AM

ప్రముఖ గాయని ఉషా ఉతప్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త జానీ చాకో ఉతప్‌ సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 78 ఏళ్లు. కోల్‌కతాలోని వారి ఇంట్లో టీవీ చూస్తున్న...

ప్రముఖ గాయని ఉషా ఉతప్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త జానీ చాకో ఉతప్‌ సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 78 ఏళ్లు. కోల్‌కతాలోని వారి ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో ఆయనకు గుండె పోటు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. ఈ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Updated Date - Jul 10 , 2024 | 01:21 AM