ప్రేమకు నిర్వచనం ఇచ్చే ఉషా పరిణయం

ABN , Publish Date - Jul 09 , 2024 | 02:15 AM

Prēmaku nirvacanaṁ iccē uṣā pariṇayaṁ

‘నువ్వే నువ్వే’, ‘మన్మధుడు’, ‘మల్లీశ్వరి’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లను ప్రేక్షకులకు అందించిన పాపులర్‌ డైరెక్టర్‌ కె.విజయ్‌భాస్కర్‌. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఉషా పరిణయం’. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ అనేది ఉపశీర్షిక. ఈ ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో విజయభాస్కర్‌ తనయుడు శ్రీకమల్‌ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్‌గా తన్వీ ఆకాంక్ష నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెల 2న విడుదల అవుతుందని మేకర్స్‌ సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ విజయభాస్కర్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ప్రేమకు నేనిచ్చే నిర్వచనం. సినిమా లవర్స్‌కు ఫుల్‌ మీల్స్‌లా ఉంటుందీ చిత్రం. ఈ సినిమా అందరికీ నచ్చేలా అన్ని రకాల భావోద్వేగాలతో ఉంటుంది’’ అని చెప్పారు.

Updated Date - Jul 09 , 2024 | 02:15 AM