ఉత్కంఠభరితంగా ఉర్వి

ABN , Publish Date - Jan 22 , 2024 | 01:03 AM

మహేశ్‌, శ్రుతీశంకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఉర్వి’. కిరణ్‌ వై దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గిరి పయ్యావుల నిర్మాత. ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. ఇటీవలే చిత్రబృందం ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది...

ఉత్కంఠభరితంగా ఉర్వి

మహేశ్‌, శ్రుతీశంకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఉర్వి’. కిరణ్‌ వై దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గిరి పయ్యావుల నిర్మాత. ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. ఇటీవలే చిత్రబృందం ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌, నవీన్‌ యాదవ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రేక్షకులు ఆదరించాలి’ అని కోరారు. దర్శకుడు మాట్లాడుతూ ‘తెలంగాణ నేపథ్యంలో రూపొందిన హారర్‌ చిత్రమిది. నేటి సమాజం ఎదుర్కొంటున్న ఓ సమస్యను తీసుకొని ఆసక్తికరంగా తెరకెక్కించాం. మూడు పాటలూ, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’ అని తెలిపారు. అంతా కొత్తవాళ్లమే అయినా కష్టపడి సినిమాను తెరకెక్కించాం అని మహేశ్‌ చెప్పారు. ఈ చిత్రానికి లక్ష్మణ సాయి సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Jan 22 , 2024 | 01:03 AM