షూటింగ్‌లో గాయపడ్డ ఊర్వశీ రౌతేలా?

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:41 AM

బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న (ఎన్‌బీకే 109- వర్కింగ్‌ టైటిల్‌) చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో కథానాయికగా నటిస్తున్న ఊర్వశీ రౌతేలా మంగళవారం...

బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న (ఎన్‌బీకే 109- వర్కింగ్‌ టైటిల్‌) చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో కథానాయికగా నటిస్తున్న ఊర్వశీ రౌతేలా మంగళవారం షూటింగ్‌లో గాయపడ్డారని సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. యాక్షన్‌ సీక్వెన్స్‌ చేస్తుండగా ఆమె కాలికి తీవ్రంగా గాయాలయ్యాయని, వెంటనే ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారని ప్రచారం జరిగింది. దీనిపై ఊర్వశి, ఆ చిత్రబృందం ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు. ఈ వార్తల నేపథ్యంలో బుధవారం ఊర్వశి సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. చికిత్స తీసుకుంటున్న వీడియోను షేర్‌ చేశారు. త్వరలోనే కోలుకొని సెట్స్‌కు తిరిగొస్తానని చెబుతూ విజయ సంకేతం చూపారు.

Updated Date - Jul 11 , 2024 | 04:41 AM