విశ్వం.. విధ్వంసం

ABN , Publish Date - Apr 12 , 2024 | 05:30 AM

కల్యాణ మండపంలో పెళ్లి జరుగుతోంది. పురోహితుడు పెళ్లి మంత్రాలు చదువుతున్నాడు. వాద్య బృందం రకరకాల వాయిద్యాలతో సందడి చేస్తోంది. మరో పక్క విందు కోసం రుచికరమైన ఆహార పదార్ధాలను...

విశ్వం.. విధ్వంసం

కల్యాణ మండపంలో పెళ్లి జరుగుతోంది. పురోహితుడు పెళ్లి మంత్రాలు చదువుతున్నాడు. వాద్య బృందం రకరకాల వాయిద్యాలతో సందడి చేస్తోంది. మరో పక్క విందు కోసం రుచికరమైన ఆహార పదార్ధాలను ఛెఫ్‌లు సిద్దం చేస్తున్నారు. ఇంతలో గిటార్‌ బ్యాగ్‌ని భుజాన వేసుకుని అక్కడికి వచ్చాడు. ఒక చోట ఆగి ఆ బ్యాగ్‌ ఓపెన్‌ చేశాడు. అందులోంచి గిటార్‌ను కాదు.. మెషిన్‌ గన్‌ను తీసుకుని వధువరులతో సహా అందరినీ కాల్చడం ప్రారంభించాడు. వాళ్లంతా నేలకు ఒరిగిన తర్వాత అక్కడి ఫుడ్‌ని ఆస్వాదిస్తూ ‘దానే దానే పే లిఖా .. ఖానే వాలే కా నామ్‌.. ఇస్పే లిఖా మేరా నామ్‌’ అన్నాడు. ఎవరతను? పెళ్లిమంటపంలో ఎందుకీ విద్వంసం సృష్టించాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. గోపీచంద్‌ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ‘విశ్వం’ అని పేరు పెట్టి విడుదల చేసిన ఫస్ట్‌ స్ర్టైక్‌ వీడియోలో మాటర్‌ ఇది. ఈ చిత్రానికి స్ర్కీన్‌ప్లే: గోపీమోహన్‌, సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌, ఛాయాగ్రహణం: గుహన్‌, సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్‌, వేణు దోనేపూడి.

Updated Date - Apr 12 , 2024 | 05:30 AM