యూనిక్ కాన్సెప్ట్
ABN , Publish Date - Feb 06 , 2024 | 01:05 AM
టాలీవుడ్‌లో దాదాపు స్టార్ హీరోలందరితో పని చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సిద్దార్థ్ రాయ్’ ఈ నెల 23న విడుదల కానుంది. హరీశ్‌శంకర్, వంశీ పైడిపల్లి వంటి...

టాలీవుడ్‌లో దాదాపు స్టార్ హీరోలందరితో పని చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సిద్దార్థ్ రాయ్’ ఈ నెల 23న విడుదల కానుంది. హరీశ్‌శంకర్, వంశీ పైడిపల్లి వంటి దర్శకుల దగ్గర పనిచేసిన యశస్వీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యూనిక్ కాన్సెప్ట్‌తో, మంచి కంటెంట్‌తో రూపొందిన ఈ చిత్రంలో తన్వి నేగి కథానాయిక. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్, పాటలు బాగా వైరల్ అయ్యాయనీ, సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందనీ నిర్మాతలు జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రథన్, ఫొటోగ్రఫీ: శ్యామ్ కె నాయుడు, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, సహ రచయితలు: అన్వర్ మహ్మద్, లుధీర్ బైరెడ్డి.