ఊహించని మలుపుల మిస్‌ పర్‌ఫెక్ట్‌

ABN , Publish Date - Jan 04 , 2024 | 05:59 AM

ఏ పని అయినా పర్‌ఫెక్ట్‌గా చేసేవాడ్ని మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అనడం విన్నాం. త్వరలో ‘మిస్‌ ఫర్‌ఫెక్ట్‌’ గురించి వినబోతున్నాం. ఏ పనినయినా పర్‌ఫెక్ట్‌గా చేయడమే కాక చేయించడం ఈ మిస్‌ పర్‌ఫెక్ట్‌ స్పెషాలిటీ...

ఊహించని మలుపుల మిస్‌ పర్‌ఫెక్ట్‌

ఏ పని అయినా పర్‌ఫెక్ట్‌గా చేసేవాడ్ని మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అనడం విన్నాం. త్వరలో ‘మిస్‌ ఫర్‌ఫెక్ట్‌’ గురించి వినబోతున్నాం. ఏ పనినయినా పర్‌ఫెక్ట్‌గా చేయడమే కాక చేయించడం ఈ మిస్‌ పర్‌ఫెక్ట్‌ స్పెషాలిటీ. ఈ కేరక్టరైజేషన్‌ చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందిన వెబ్‌ సిరీస్‌ ’మిస్‌ పర్‌ఫెక్ట్‌’. లావణ్య త్రిపాఠి టైటిల్‌రోల్‌ పోషిస్తున్న ఈ సిరీ్‌సలో అభిజిత్‌ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. డైరెక్టర్‌ విశ్వక్‌ ఖండేరావ్‌. అతిత్వరలో ప్రసారం కానున్న ఈ సిరీ్‌సకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని బుధవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా ‘ కొత్త ఏడాదిని పర్‌ఫెక్ట్‌గా మొదలుపెట్టబోతున్నాం. అంటూ తన వ్యక్తిగత సాంఘిక మాధ్యమం ద్వారా స్పందించారు లావణ్య త్రిపాఠి. ఒక యూనిక్‌ స్టోరీతో వస్తున్నందుకు ఆనందంగా ఉందని, అనుకోకుండా ఏర్పడిన బంధాలవల్ల జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయి అనే ఇతివృత్తంతో వినోదభరిత ప్రేమకథగా ’మిస్‌ పర్‌ఫెక్ట్‌’ సిరీస్‌ ఉంటుందని సుప్రియ యార్లగడ్డ చెప్పారు. ఝాన్సీ, హర్షవర్దన్‌, మహేశ్‌ విట్టా, హర్ష్‌ రోషన్‌ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సిరీ్‌సకి కెమెరా: ఆదిత్య జువ్వాది, సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌.విహారి.

Updated Date - Jan 04 , 2024 | 05:59 AM