సినిమా నేపథ్యంలో రుద్రాక్షపురం

ABN , Publish Date - Apr 17 , 2024 | 02:55 AM

మణి సాయితేజ, వైడూర్య హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రుద్రాక్షపురం’. ఆర్‌.కె.గాంధీ దర్శకత్వం వహించగా, కొండ్రాసి ఉపేందర్‌ నిర్మించారు. ప్రముఖ నటుడు నాగ మహేశ్‌, ఫిల్మ్‌ జర్నలిస్ట్స్‌...

సినిమా నేపథ్యంలో  రుద్రాక్షపురం

మణి సాయితేజ, వైడూర్య హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రుద్రాక్షపురం’. ఆర్‌.కె.గాంధీ దర్శకత్వం వహించగా, కొండ్రాసి ఉపేందర్‌ నిర్మించారు. ప్రముఖ నటుడు నాగ మహేశ్‌, ఫిల్మ్‌ జర్నలిస్ట్స్‌ సురేశ్‌ కొండేటి, బి.వీరబాబు, అప్పాజీ కీలక పాత్రలు పోషించారు. సినిమా నేపథ్యంలో సాగే ‘రుద్రాక్షపురం’ చిత్రం ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ చిత్రానికి ఎడిటర్‌:డి.మల్లి, కెమెరామెన్‌: నాగేంద్రకుమార్‌, సంగీతం: ఎం.ఎల్‌ రాజా, ఘంటాడి కృష్ణ, జయసూర్య బొంపెం. ఈ కార్యక్రమంలో తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌, దర్శకనిర్మాత లయన్‌ సాయివెంకట్‌, తదితరులు పాల్గొని సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Updated Date - Apr 17 , 2024 | 02:55 AM