Nuvvu Nenu: మార్చి 21న.. ఉదయ్ కిరణ్ ‘నువ్వు నేను’ రీ రిలీజ్

ABN , Publish Date - Mar 05 , 2024 | 05:59 PM

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న వారిలో ఒకరు ఉదయ్ కిరణ్. ఆయ‌న కేరీర్ మొద‌ట్లో నటించిన నువ్వు నేను అద్భుతమైన విజయం సాధించి యూత్ సినిమాల‌కు ఓ ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.

Nuvvu Nenu: మార్చి 21న.. ఉదయ్ కిరణ్ ‘నువ్వు నేను’ రీ రిలీజ్
nuvvu nenu

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఒకరు ఉదయ్ కిరణ్ (Uday Kiran ). ఆయ‌న కేరీర్ మొద‌ట్లో నువ్వు నేను (Nuvvu Nenu) అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

uday.jpeg

ఈ మూవీలో అనిత (anitaha) హీరోయిన్‌గా నటించగా.. ఈ స‌మ‌యంలో టాలీవుడ్ సూపర్ క్రేజ్ దర్శకులలో ఒకరైన తేజ (Teja) ఈ మూవీ కి దర్శకత్వం, ఆర్ పి పట్నాయక్ (rp patnaik) సంగీతం అందించారు. హ‌స్య న‌ట‌డు సునీల్‌కు ఈ చిత్రంతోనే మంచి పేరొచ్చింది కూడా.

ukiran.jpeg

ఈ మూవీపై ప్రారంభంలో పెద్దగా అంచనాలు లేకుండా 2001 ఆగస్టు 10న థియేటర్లలో విడుదల అయి మొదటి రోజు మొదటి షో కే బాక్సాఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీకి కలెక్షన్లు కూడా భారీగా రావ‌డ‌మే కాక బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.

Nuvvu-Nenu.jpg


ఆ సమయంలో అంత‌ అద్భుతమైన విజయం సాధించి యూత్ సినిమాల‌కు ఓ ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచిన‌ ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.

nuvvu nenu.jpeg

ఇప్పటికే ఈ మూవీ బృందం సినిమాకు సంబంధించిన రీ రిలీజ్‌ పనులను ప్రారంభించారు. మార్చి 21న థియేటర్స్ లో రీ రిలీజ్ చేయ‌నున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Updated Date - Mar 05 , 2024 | 05:59 PM