టైసన్ నాయుడు బరిలో దిగాడు
ABN , Publish Date - Jan 04 , 2024 | 05:56 AM
తొలి చిత్రం ‘భీమ్లానాయక్’తోనే దర్శకుడిగా ఘన విజయం అందుకున్నారు సాగర్ కె. చంద్ర. ఇప్పుడు ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు...
తొలి చిత్రం ‘భీమ్లానాయక్’తోనే దర్శకుడిగా ఘన విజయం అందుకున్నారు సాగర్ కె. చంద్ర. ఇప్పుడు ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. సాయి శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం చిత్రబృందం టైటిల్‌ను ప్రకటించి, గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘టైసన్ నాయుడు’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను యూనిట్ ఖరారుచేసింది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ అభిమానిగా శ్రీనివాస్‌ను పరిచయం చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఆయన డీఎస్‌పీ పాత్రలో అలరించనున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.