ఒకేసారి రెండు సినిమాలు
ABN, Publish Date - Oct 23 , 2024 | 02:07 AM
‘కాఫీ విత్ ఏ కిల్లర్’, ‘సోలో బాయ్’ సినిమాల అప్డేట్స్ ఇచ్చారు ప్రముఖ నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్. ‘గతంలో నేను తీసిన ‘బట్టల రామస్వామి’ బయోపిక్, ‘అందరి బంధువయా’ మంచి పేరును...
‘కాఫీ విత్ ఏ కిల్లర్’, ‘సోలో బాయ్’ సినిమాల అప్డేట్స్ ఇచ్చారు ప్రముఖ నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్. ‘గతంలో నేను తీసిన ‘బట్టల రామస్వామి’ బయోపిక్, ‘అందరి బంధువయా’ మంచి పేరును తీసుకొచ్చాయి. కొవిడ్ టైమ్‌లో కూడా బట్టల రామస్వామిని ప్రజలు ఆదరించారు. అలాగే ‘కాఫీ విత్ ఏ కిల్లర్’, ‘సోలో బాయ్’ సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి అని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ‘కంటెంట్ ఉంటే సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. నా గత సినిమాల మాదిరిగానే ఈ రెండు సినిమాలనూ డిఫరెంట్ జానర్‌లో చేశాము. ‘సోలో బాయ్’ సినిమా ద్వారా నవీన్ కుమార్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాం.’ అని సతీష్ తెలిపారు.