రెండున్నరేళ్ల కష్టం

ABN , Publish Date - Feb 12 , 2024 | 05:29 AM

సందీ్‌పకిషన్‌ నటిస్తున్న మ్యాజికల్‌ ఫాంటసీ అడ్వెంచర్‌ ‘ఊరు పేరు భైరవకోన’. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విఐ ఆనంద్‌ దర్శకత్వం వహించారు...

రెండున్నరేళ్ల కష్టం

సందీ్‌పకిషన్‌ నటిస్తున్న మ్యాజికల్‌ ఫాంటసీ అడ్వెంచర్‌ ‘ఊరు పేరు భైరవకోన’. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విఐ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. రాజేశ్‌ దండా నిర్మాత. అనిల్‌ సుంకర సమర్పకుడు. ఈ నెల 16న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా ఆదివారం చిత్ర యూనిట్‌ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో సందీప్‌ మాట్లాడుతూ ‘రెండున్నర ఏళ్లు ఈ సినిమా కోసం దర్శకుడు ఆనంద్‌ ఎంతో కష్టపడ్డారు.సూపర్‌ నేచురల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న మంచి కమర్షియల్‌ సినిమా ఇది. సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాం’ అన్నారు. ‘చాలా మంచి సినిమా ఇది. దీంతో సందీప్‌ నెక్ట్స్‌ లెవెల్‌కు వెళతాడు. సినిమా అద్భుతంగా వచ్చింది’ అన్నారు అనిల్‌ సుంకర. దర్శకుడు ఆనంద్‌ మాట్లాడుతూ ‘అద్భుతమైన జర్నీ ఈ సినిమా. ఇందులో ప్రతి మూమెంట్‌ మాకు ఓ కొత్త అనుభవం. ఆడియన్స్‌ తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు’ అన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 05:29 AM