నా కెరీర్‌ను మలుపు తిప్పింది

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:21 AM

2023... నటుడిగా నా కెరీర్‌ను మలుపు తిప్పిన సంవత్సరం అని శ్రీతేజ్‌ చెప్పారు. ‘ధమాకా’, ‘మంగళవారం’ తదితర చిత్రాలతో నటుడిగా ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ‘పుష్ప2’ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు...

నా  కెరీర్‌ను మలుపు తిప్పింది

2023... నటుడిగా నా కెరీర్‌ను మలుపు తిప్పిన సంవత్సరం అని శ్రీతేజ్‌ చెప్పారు. ‘ధమాకా’, ‘మంగళవారం’ తదితర చిత్రాలతో నటుడిగా ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ‘పుష్ప2’ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. తన సినీ కెరీర్‌ గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కొన్నేళ్లుగా చాలా మంచి సినిమాలు చేస్తున్నా. కానీ గతేడాది మాత్రం నటుడిగా నాకు మంచి అవకాశాలు దక్కాయి. మంగళవారం’ చిత్రం నాకు మంచి పేరు తెచ్చింది. ‘రావణాసుర, దళారి’ చిత్రాలు నటుడిగా ప్రేక్షకులకు గుర్తిండిపోయేలా చేశాయి. అలాగే ఈ ఏడాది ‘బహిష్కరణ’ అనే వెబ్‌సిరీస్‌ చేస్తున్నాను. ‘ర్యాంబో’ చిత్రంలో నా పాత్ర వైవిధ్యంగా ఉండబోతోంది’ అన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 12:21 AM