ఆటోతో టుక్‌ టుక్‌

ABN , Publish Date - May 21 , 2024 | 06:11 AM

చిత్ర వాహినీ, ఆర్‌వైజీ సంస్థలు నిర్మిస్తున్న ‘టుక్‌ టుక్‌’ పోస్టర్‌ను విడుదల చేశారు. విచిత్రమైన ఆటోతో ఈ పోస్టర్‌ ఆకర్షణీయంగా ఉంది. సుప్రీత్‌ సి.కృష్ణ దర్శకత్వం...

ఆటోతో టుక్‌ టుక్‌

చిత్ర వాహినీ, ఆర్‌వైజీ సంస్థలు నిర్మిస్తున్న ‘టుక్‌ టుక్‌’ పోస్టర్‌ను విడుదల చేశారు. విచిత్రమైన ఆటోతో ఈ పోస్టర్‌ ఆకర్షణీయంగా ఉంది. సుప్రీత్‌ సి.కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోలు హర్షరోషన్‌, కార్తికేయ దేవ్‌, స్టీవెన్‌ మధు ఓ ఆటో బొమ్మను ఆసక్తికరంగా చూస్తున్నారు. అసలు ఆ ఆటో బొమ్మ ఏమిటి, దానికీ, చిత్రకథకు ఉన్న సంబంధం ఏమిటి అనే అంశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. సోషియో ఫాంటసీ ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రాన్ని రాహుల్‌ రెడ్డి, లోక్కు సాయివరుణ్‌, శ్రీరాములు రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు సంగీతం: సంతు ఓంకార్‌, ఫొటోగ్రఫీ: హార్ధిక్‌ శ్రీకుమార్‌.

Updated Date - May 21 , 2024 | 06:11 AM