మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ట్రూ లవర్‌ ఈ వాలెంటైన్‌ విన్నర్‌

ABN, Publish Date - Feb 09 , 2024 | 03:12 AM

మణికందన్‌, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి ప్రధాన తారాగణంగా రూపొందిన తమిళ చిత్రం ‘ట్రూ లవర్‌’. ఈ ప్రేమకథా చిత్రానికి ప్రభురామ్‌ వ్యాస్‌ దర్శకత్వం వహించారు. దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్‌కేఎన్‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు...

మణికందన్‌, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి ప్రధాన తారాగణంగా రూపొందిన తమిళ చిత్రం ‘ట్రూ లవర్‌’. ఈ ప్రేమకథా చిత్రానికి ప్రభురామ్‌ వ్యాస్‌ దర్శకత్వం వహించారు. దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్‌కేఎన్‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 10న ‘ట్రూ లవర్‌’ విడుదలవుతోంది. గురువారం చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ ‘తమిళ ప్రీమియర్స్‌ చూసిన వాళ్లు ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదని చెబుతున్నారు. తెలుగువాళ్లకూ ఈ సినిమా బాగా నచ్చుతుంది. పెయిడ్‌ ప్రీమియర్స్‌ వేస్తున్నాం. మణికందన్‌, గౌరీప్రియ నటన ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఈ వాలెంటైన్‌ డే విన్నర్‌ అవుతుంది. ‘బేబీ’ హిందీ రీమేక్‌లో నేను నటించడం లేదు’ అని తెలిపారు. మారుతి మాట్లాడుతూ ‘ట్రూ లవర్‌’ కథను దర్శకుడు సహజంగా తెరకెక్కించాడు. దర్శకుడి ప్రతిభ అబ్బురపరుస్తుంది. ప్రేమికులే కాదు కుటుంబం అంతా కలసి చూసే సినిమా ఇది’ అన్నారు. మణికందన్‌ మాట్లాడుతూ ‘పక్కా స్ర్కీన్‌ప్లేతో తీసిన సినిమా ఇది. ఇక్కడి ప్రేక్షకులు నన్ను తెలుగు నటుడిగానే చూస్తున్నారు. మారుతి, ఎస్‌కేఎన్‌ రిలీజ్‌ చేయడం వల్ల ఈ సినిమా స్థాయి పెరిగింది’ అని చెప్పారు. శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ ‘ఈ చిత్రం తమిళ ప్రీమియర్స్‌కు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన వస్తోంది. తెలుగులో సూపర్‌ హిట్‌ అవుతుందని నమ్ముతున్నాం’ అన్నారు.

Updated Date - Feb 09 , 2024 | 03:12 AM