వెబ్‌ సిరీస్‌లో త్రిష

ABN , Publish Date - Jul 10 , 2024 | 01:27 AM

హీరోయిన్‌ త్రిష తొలిసారిగా ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. అనూహ్యమైన మలుపులతో, ఉత్కంఠభరితంగా సాగే ఆ సిరీస్‌ పేరు ‘బృంద’. సోనీ లివ్‌లో ఆగస్టు 2న ఇది స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతో పాటు...

హీరోయిన్‌ త్రిష తొలిసారిగా ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. అనూహ్యమైన మలుపులతో, ఉత్కంఠభరితంగా సాగే ఆ సిరీస్‌ పేరు ‘బృంద’. సోనీ లివ్‌లో ఆగస్టు 2న ఇది స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠి, బెంగాలీ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతుండడం విశేషం. ఈ సిరసీ్‌ గురించి దర్శకుడు సూర్య మనోజ్‌ వంగాల మాట్లాడుతూ ‘ఆద్యంతం సస్పెన్స్‌తో ‘బృంద’ సిరీస్‌ సాగుతుంది. శక్తిమంతమైన ఫిమేల్‌ లీడ్‌ నేరేటివ్‌ స్టోరీ ఇది. దీన్ని చూశాక ఇప్పటిదాకా నమ్ముతున్న నమ్మకాల మీద ఫోకస్‌ పెరుగుతుంది. ఈ జోనర్‌లో వచ్చే సినిమాలకు కొత్త నిర్వచనం చెప్పేలా ఉంటుంది’ అన్నారు. సూర్య మనోజ్‌ వంగాల, పద్మావతి మల్లాది కలసి రూపొందించిన స్ర్కీన్‌ప్లే సిరీస్‌కు హైలైట్‌ అవుతుందని అంటున్నారు. డ్రామా, క్రైమ్‌, మిస్టరీ అంశాలతో రూపొందిన ఈ సిరీస్‌కు శక్తికాంత్‌ కార్తిక్‌ సంగీతం అందించారు. దినేష్‌ కె బాబు ఛాయాగ్రాహకుడు. ఇంద్రజిత్‌ సుకుమారన్‌, జయప్రకాశ్‌, ఆమని, రవీంద్ర విజయ్‌, ఆనంద్‌ సామి, రాకేందు మౌళి తదితరులు నటించారుజ

Updated Date - Jul 10 , 2024 | 01:27 AM