వాకిలి పద్మ

ABN , Publish Date - Nov 09 , 2024 | 06:16 AM

భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడు బార్బరిక్‌(బార్బరికుడు) పాత్ర ఆధారంగా ‘త్రిబాణధారి బార్బరిక్‌’ సినిమా మోహన్‌ శ్రీవత్స

భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడు బార్బరిక్‌(బార్బరికుడు) పాత్ర ఆధారంగా ‘త్రిబాణధారి బార్బరిక్‌’ సినిమా మోహన్‌ శ్రీవత్స దర్శకత్వంలో రాబోతోంది. విజయపాల్‌ రెడ్డి ఆదిదల నిర్మాత. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్‌ వదిలారు. ఉదయభాను పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసి మరింత హైప్‌ పెంచారు. మూవీలో వాకిలి పద్మ అనే పాత్రను ఆమె పోషించారు. పోస్టర్‌లో ఉదయభాను యాటిట్యూడ్‌, కూర్చున్న తీరు కొత్తగా ఉన్నాయి.

Updated Date - Nov 09 , 2024 | 06:16 AM