మంచి చిత్రాన్ని అందించాలని...

ABN , Publish Date - May 07 , 2024 | 05:54 AM

తమిళంలో చిన్న చిత్రంగా విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటూ పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం ‘రంగోళి’ని తెలుగులో ‘సత్య’గా డబ్‌ చేశారు. హమరేశ్‌, ప్రార్థన సందీప్‌ హీరో హీరోయిన్లుగా...

మంచి చిత్రాన్ని అందించాలని...

తమిళంలో చిన్న చిత్రంగా విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటూ పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం ‘రంగోళి’ని తెలుగులో ‘సత్య’గా డబ్‌ చేశారు. హమరేశ్‌, ప్రార్థన సందీప్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. ఆడుకాలం మురుగదాస్‌, సాయిశ్రీ, అక్షయ కీలక పాత్రలు పోషించారు. వాలి మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహించారు. తెలుగు వర్షన్‌కు శివ మల్లాల నిర్మాత. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ‘సత్య’ ఈ నెల 10న తెలుగులో విడుదల అవుతోంది. సోమవారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ వేడుకలో 8 మంది దర్శకులు కలసి ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ ‘‘నిర్మాతగా ఒక ప్రేక్షకులకు ఒక మంచి చిత్రాన్ని అందించాలని ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తున్నా’’ అని చెప్పారు. దర్శకుడు వాలి మోహన్‌ దాస్‌ మాట్లాడుతూ ‘‘కుటుంబం కథా చిత్రంగా వస్తున్న ‘సత్య’ను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలి’’ అని కోరారు.

Updated Date - May 07 , 2024 | 05:54 AM