ఆ లోటును భర్తీ చేసేలా...

ABN , Publish Date - Jul 29 , 2024 | 04:09 AM

‘నువ్వేకావాలి’, ‘మన్మథుడు’, ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలతో పాపులర్‌ దర్శకుడిగా మారారు కె. విజయ్‌భాస్కర్‌. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉషా పరిణయం’. ‘లవ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ అనేది...

‘నువ్వేకావాలి’, ‘మన్మథుడు’, ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలతో పాపులర్‌ దర్శకుడిగా మారారు కె. విజయ్‌భాస్కర్‌. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉషా పరిణయం’. ‘లవ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ అనేది ఉపశీర్షిక. ఈ లవ్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో శ్రీకమల్‌, తాన్వీ ఆకాంక్ష, సూర్య ప్రధాన తారాగణంగా నటించారు. ఆగస్టు 2న ఈ చిత్రం విడుదలవుతోన్న సందర్భంగా కె. విజయ్‌భాస్కర్‌ మీడియాతో ముచ్చటించారు. ‘ఈ సినిమా ప్రేమకు సరికొత్త నిర్వచనం ఇస్తుంది. ఈ మధ్య కాలంలో ప్రేమ కథలు చాలా తక్కువగా వస్తున్నాయి. ఇది ఆ లోటును భర్తీ చేస్తుంది. ఇంటిల్లిపాదీ చూడదగిన చిత్రమిది. ఉషా అనే అమ్మాయి పెళ్లి చుట్టూ సినిమా కథాంశం సాగుతుంది. మా అబ్బాయి కమల్‌ కోసం ప్రత్యేకంగా కథ రాసుకుని ఈ సినిమా చేయట్లేదు.


ఈ కథకు తను యాప్ట్‌ కాబట్టే కమల్‌ను హీరోగా ఎంచుకున్నాను. కమల్‌, కథానాయిక తాన్వీ నటన చాలా సహజంగా.. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ సినిమాకు సంగీతం ప్రధానాకర్షణ. ఆర్‌.ఆర్‌.ధ్రువన్‌ అద్భుతమైన పాటలు అందించారు. సినిమా యూత్‌తో పాటు ఫ్యామిలీని కూడా ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు.

Updated Date - Jul 29 , 2024 | 04:09 AM