కొత్త అనుభూతినిచ్చేలా...
ABN , Publish Date - Dec 29 , 2024 | 05:01 AM
నిరుడు విడుదలైన ‘మ్యాడ్’ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా వస్తోన్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో...
నిరుడు విడుదలైన ‘మ్యాడ్’ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా వస్తోన్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 విడుదలకు సిద్ధమవుతోంది. ‘లడ్డు గాని పెళ్లి’ అంటూ ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి గీతానికి మంచి స్పందన లభించింది. తాజాగా ‘స్వాతి రెడ్డి’ అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. రెబా మోనికా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సురేశ్ గంగుల సాహిత్యానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించడమే కాకుండా స్వాతిరెడ్డితో కలసి ఆలపించారు. ఈ పాట ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిచ్చేలా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది.