బ్యూటిఫుల్‌ ఫీల్‌ ఇచ్చేలా...

ABN , Publish Date - Apr 18 , 2024 | 06:39 AM

‘పొలిమేర-2’ చిత్రంతో సెన్షేషనల్‌ సక్సెస్‌ను అందుకున్నారు సత్యం రాజేశ్‌. ఆయన నటించిన లేటేస్ట్‌ చిత్రం ‘టెనెంట్‌’. మేఘా చౌదరి, చందన వయ్యాపుల, ఎస్తర్‌ నోరోన్హా, భరత్‌కాంత్‌ కీలక పాత్రలు పోషించారు....

బ్యూటిఫుల్‌ ఫీల్‌ ఇచ్చేలా...

‘పొలిమేర-2’ చిత్రంతో సెన్షేషనల్‌ సక్సెస్‌ను అందుకున్నారు సత్యం రాజేశ్‌. ఆయన నటించిన లేటేస్ట్‌ చిత్రం ‘టెనెంట్‌’. మేఘా చౌదరి, చందన వయ్యాపుల, ఎస్తర్‌ నోరోన్హా, భరత్‌కాంత్‌ కీలక పాత్రలు పోషించారు. వై.యుగంధర్‌ దర్శకత్వం వహించారు. చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌ సినిమాపై అందరిలో అంచనాలను పెంచేసింది. రేపు ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా హీరో సత్యం రాజేశ్‌ మీడియాతో ముచ్చటించారు.

‘‘ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగే స్టోరీ ‘టెనెంట్‌’. కొత్తగా పెళ్లైన ఓ జంట..ఎన్నో ఆశలతో నూతన జీవితాన్ని మొదలుపెడుతుంది. ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తుల వల్ల ఆ భార్యాభర్తల మధ్య వచ్చే ప్రాబ్లమ్స్‌ను ఇందులో చూపించాం. ఇందులోని సన్నివేశాలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. ప్రేక్షకులకు బ్యూటిఫుల్‌ ఫీల్‌ ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమాలో ట్విస్ట్‌లు ఉండవు కానీ.. సస్పెన్స్‌ ఉంటుంది. మర్డర్‌ మిస్టరీ కాబట్టి చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్‌ చూసి ప్రేక్షకులు సింపతీతో బయటకు వస్తారు. సినిమాలో నేను మాట్లాడేదే చాలా తక్కువ. కానీ ప్రేక్షకులు ఎక్కడా బోర్‌ ఫీల్‌ అవ్వరు. భారీ బడ్జెట్‌, యాక్షన్‌ ఓరియెంట్‌డ్‌ చిత్రాలు కాకుండా నాకు సూటయ్యే మంచి కాన్సెప్ట్‌ ఓరియెంట్‌డ్‌ చిత్రాలనే ఎంపిక చేసుకుంటున్నా. ప్రస్తుతం ‘స్ట్రీట్‌ ఫైట్‌’ సినిమాలో మెయిన్‌ లీడ్‌గా చేస్తున్నా, ‘మిస్టర్‌ బచ్చన్‌’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నా’’ అని చెప్పారు.

Updated Date - Apr 18 , 2024 | 06:39 AM