ఉత్కంఠ పెంచి వినోదం పంచేలా

ABN , Publish Date - Feb 21 , 2024 | 03:48 AM

అర్జున్‌ కల్యాణ్‌, కుషిత్‌ క ల్లపు హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘బాబు నంబర్‌ వన్‌ బుల్‌షిట్‌ గై’. లక్ష్మణవర్మ దర్శకత్వంలో దండు దిలీప్‌ కుమార్‌ రెడ్డి నిర్మించారు. మార్చి 8న ఈ చిత్రం విడుదలవుతోంది...

ఉత్కంఠ పెంచి వినోదం పంచేలా

అర్జున్‌ కల్యాణ్‌, కుషిత్‌ క ల్లపు హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘బాబు నంబర్‌ వన్‌ బుల్‌షిట్‌ గై’. లక్ష్మణవర్మ దర్శకత్వంలో దండు దిలీప్‌ కుమార్‌ రెడ్డి నిర్మించారు. మార్చి 8న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా అర్జున్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ ‘హీరోగా నన్ను మరో మెట్టు ఎక్కించే చిత్రమిది. థ్రిల్లర్‌, డ్రామా ఉన్న కథతో మూడు భాషల్లో తెరకెక్కించాం’ అని తెలిపారు. ‘దిలీప్‌గారు రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ఉత్కంఠ కలిగించడంతో పాటు వినోదం పంచేలా ఉంటుంది. నటీనటులు, టీమ్‌ అంతా చాలా కష్టపడి ఒక మంచి సినిమాను రూపొందించాం. మా సినిమాను ఆదరించాలి’ అని దర్శకుడు ప్రేక్షకులను కోరారు. కుటుంబంతో కలసి చూసేలా ఈ సినిమా ఉంటుందని కుషిత చెప్పారు. దర్శకుడు సాయిరాజేశ్‌, నిర్మాత ఎస్కేఎన్‌, వికేక్‌ కూచిబొట్ల ముఖ్య అతిథులుగా పాల్గొని సినిమా ఘనవిజయం అందుకోవాలని ఆకాంక్షించారు.

Updated Date - Feb 21 , 2024 | 03:48 AM