అందరికీ నచ్చేలా...

ABN , Publish Date - May 30 , 2024 | 12:09 AM

ఇప్పటివరకూ పక్కింటి అబ్బాయి తరహా పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆనంద్‌ దేవరకొండ.. తొలిసారి ఎనర్జిటిక్‌ యాక్షన్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘గం గం గణేశా’. ఈ క్రైమ్‌ కామెడీ యాక్షన్‌...

అందరికీ నచ్చేలా...

ఇప్పటివరకూ పక్కింటి అబ్బాయి తరహా పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆనంద్‌ దేవరకొండ.. తొలిసారి ఎనర్జిటిక్‌ యాక్షన్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘గం గం గణేశా’. ఈ క్రైమ్‌ కామెడీ యాక్షన్‌ ఎంటర్టైనర్‌కు ఉదయ్‌ శెట్టి దర్శకత్వం వహించారు. కేదార్‌ శెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. రేపు ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో ఆనంద్‌ దేవరకొండ మీడియాతో ముచ్చటించారు.


‘‘ఈ సినిమాలో నా పాత్ర కొంచెం హైపర్‌యాక్టివ్‌గా ఉంటుంది. ఈ పాత్రకు తగినట్లు మేకోవర్‌ అవ్వడానికి కొంచెం టైమ్‌ తీసుకున్నాను. వినాయకుడి విగ్రహం చుట్టూ తిరిగే కథ ఇది. ఆ విగ్రహాన్ని దక్కించుకోవడం కోసం చాలా మంది పోటీపడుతుంటారు. అసలు ఆ విగ్రహంలో ఏముంది.. ఎవరికి ఆ విగ్రహం దక్కింది అనేది సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సమ్మర్‌లో ఫ్యామిలీస్‌ అంతా కలసి చూసే చిత్రాలు చాలా తక్కువగా వచ్చాయి. ‘గం గం గణేశా’ ఆ లోటు తీరుస్తుంది. దర్శకుడు ఉదయ్‌ ఈ సినిమాను అందరికీ నచ్చేలా మలిచారు. ఈ సినిమా సక్సెస్‌పై చాలా నమ్మకంతో ఉన్నాను’’ అని చెప్పారు.

Updated Date - May 30 , 2024 | 12:09 AM