అందరినీ అలరించేలా...

ABN , Publish Date - Jun 13 , 2024 | 04:45 AM

షణ్ముఖ్‌ జస్వంత్‌, అనఘ అజిత్‌, ఆమని, ఆర్జే శరణ్‌ ముఖ్య తారాగణంగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఓ ఒరిజినల్‌ చిత్రం నిర్మిస్తోంది...

అందరినీ అలరించేలా...

షణ్ముఖ్‌ జస్వంత్‌, అనఘ అజిత్‌, ఆమని, ఆర్జే శరణ్‌ ముఖ్య తారాగణంగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఓ ఒరిజినల్‌ చిత్రం నిర్మిస్తోంది. పవన్‌సుంకర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీధర్‌ మారిసా నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్రాన్ని ప్రారంభించారు. దర్శకుడు వివేక్‌ ఆత్రేయ స్ర్కిప్ట్‌ అందించగా, డైరెక్టర్‌ ప్రవీణ్‌ కాండ్రేగుల క్లాప్‌ కొట్టారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఫస్ట్‌ షాట్‌కు సుబ్బు.కె, అవినాశ్‌ వర్మ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం అందరినీ అలరించేలా సూపర్బ్‌ ఎంటర్‌టైనర్‌ అవుతుంది’’ అని అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: నరేశ్‌ ఆడుప, డీఓపీ: అనూశ్‌ కుమార్‌, సంగీతం: కృష్ణ చేతన్‌.

Updated Date - Jun 13 , 2024 | 04:45 AM