బంగారంలా ఉండాలంటే...

ABN , Publish Date - Apr 29 , 2024 | 06:40 AM

అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు కాసింత విరామం ఇచ్చారు సమంత. ‘ఖుషీ’ తర్వాత సమంత ఏ మూవీకి అంగీకరించలేదు. ‘సిటాడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌ ‘హనీ బన్నీ’ వెబ్‌సిరీస్‌లో...

బంగారంలా ఉండాలంటే...

అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు కాసింత విరామం ఇచ్చారు సమంత. ‘ఖుషీ’ తర్వాత సమంత ఏ మూవీకి అంగీకరించలేదు. ‘సిటాడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌ ‘హనీ బన్నీ’ వెబ్‌సిరీస్‌లో నటించారు. సమంత నటించే మరో చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం సమంత పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులకు తీపి కబురును అందిస్తూ.. తను నటించబోతున్న నెక్స్ట్‌ సినిమా అప్‌డేట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్‌ చేశారు. ఈ సినిమా టైటిల్‌ ‘మా ఇంటి బంగారం’. ‘‘బంగారంలా ఉండాలంటే ప్రతీ వస్తువు మెరవాల్సిన పని లేదు’’ అని పేర్కొంటూ ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను షేర్‌ చేశారు సామ్‌. ఈ సినిమాతో ఆమె నిర్మాతగా మారుతుండటం విశేషం. ట్రలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను ఆమె నిర్మిస్తున్నారు. ఇందులో సమంత ఓ వైలెంట్‌ గృహిణి పాత్రలో కనిపించనున్నట్లు ఈ మోషన్‌ పోస్టర్‌ను చూస్తుంటే తెలుస్తోంది.

Updated Date - Apr 29 , 2024 | 06:40 AM