మాస్‌ను ఆకట్టుకునేలా...

ABN , Publish Date - Jul 17 , 2024 | 06:27 AM

రామ్‌ పోతినేని ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌‘లో నటిస్తున్నారు. ఇది 2019లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ను అందుకున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌...

రామ్‌ పోతినేని ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌‘లో నటిస్తున్నారు. ఇది 2019లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ను అందుకున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌. ఈ సినిమాలో హీరోయిన్‌గా కావ్య థాపర్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌, అలీ, గెటప్‌ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరి కనెక్ట్‌ బ్యానర్‌పై పూరి జగన్నాధ్‌, చార్మి కౌర్‌ నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న విడుదలవుతోంది. ఇటీవలే విడుదలైన టీజర్‌ అందరికీ నచ్చడమే కాకుండా.. సినిమాపై అంచనాలను పెంచింది. మంగళవారం ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ ‘మార్‌ ముంతా చోడ్‌ చింత’ను మేకర్స్‌ విడుదల చేశారు. మాస్‌ను ఆకట్టుకునేలా ఈ సాంగ్‌లోని లిరిక్స్‌, డాన్స్‌ మూమెంట్స్‌ సాగాయి. ఈ పాటకు శ్యామ్‌ సాహిత్యం అందించగా రాహుల్‌ సిప్లిగంజ్‌, ధనుంజయ్‌ సీపాన, కీర్తన శర్మ ఆలపించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: సామ్‌ కె నాయుడు, జియాని జియాన్నెలి

Updated Date - Jul 17 , 2024 | 06:27 AM