అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా...
ABN , Publish Date - Oct 09 , 2024 | 12:55 AM
నూతన దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కించిన ఫ్యామిలీ డ్రామా ‘జనక అయితే గనక’. సుహాస్, సంగీర్తన జంటగా నటించిన ఈ చిత్రాన్ని హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ఈ నెల 12న సినిమా విడుదలవుతున్న...
నూతన దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కించిన ఫ్యామిలీ డ్రామా ‘జనక అయితే గనక’. సుహాస్, సంగీర్తన జంటగా నటించిన ఈ చిత్రాన్ని హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ఈ నెల 12న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు సందీప్ మీడియాతో ముచ్చటించారు.
‘‘ఇది అన్ని వర్గాల వారికి కనెక్ట్ అవుతుంది. హెల్దీ హ్యూమర్, అర్థవంతమైన సంభాషణలు, బరువైన భావోద్వేగాలతో నిండిన చిత్రమిది. ఈ జనరేషన్ వారి ఆలోచనలను తెరపై అర్థవంతంగా చూపించేలా సినిమా ఉంటుంది. పెళ్లి చేసుకోవడం.. పిల్లల్ని కనడం అనేవి యూనివర్సల్ ఎమోషన్స్.. వీటిని ఆధారం చేసుకుని ఓ కీలకమైన మలుపు జోడించి కథ రాసుకున్నాను. సుహాస్ నటన ఈ సినిమాకు ఎస్సెట్. విజయ్ బుల్గానిన్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్.. ఎడిటర్.. ఆర్ట్ డైరెక్టర్.. ఇలా ప్రతీ ఒక్కరు ప్రాణం పోసి పని చేశారు. చిత్రం అన్ని వర్గాల వారిని తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.