Shah Rukh Khan: కంటి చికిత్స కోసం అమెరికాకు?

ABN , Publish Date - Jul 30 , 2024 | 04:32 AM

బాలీవుడ్‌ నటుడు షారూఖ్‌ఖాన్‌ అత్యవసర కంటి చికిత్స కోసం అమెరికా వెళ్తున్నట్లు బాలీవుడ్‌ మీడియాలో వినిపిస్తోంది. ఆయన కంటి సమస్యతో సోమవారం ముంబైలోని...

బాలీవుడ్‌ నటుడు షారూఖ్‌ఖాన్‌ అత్యవసర కంటి చికిత్స కోసం అమెరికా వెళ్తున్నట్లు బాలీవుడ్‌ మీడియాలో వినిపిస్తోంది. ఆయన కంటి సమస్యతో సోమవారం ముంబైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లగా, అక్కడి వైద్యులు అమెరికా వెళ్లాలని సూచించినట్లు సమాచారం. దీంతో నేడు షారూఖ్‌ అమెరికా వెళ్లనున్నుట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై షారూఖ్‌ పీఆర్‌ బృందం ఇంతవరకూ స్పందించలేదు. 2014లో షారూఖ్‌ కంటికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయన ప్రస్తుతం కింగ్‌ చిత్రంలో నటిస్తున్నారు.

Updated Date - Jul 30 , 2024 | 09:46 AM