32వ సినిమా విడుదలకు ముహూర్తం
ABN , Publish Date - Sep 06 , 2024 | 12:34 AM
విభిన్న కథాంశాలు ఎన్నుకొని వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని తన 32వ చిత్రం వివరాలు గురువారం ప్రకటించారు. ‘హిట్ 3’ చిత్రంలో తన లుక్‌ని, గ్లింప్స్‌ను విడుదల చేశారు. డాక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాకు...
విభిన్న కథాంశాలు ఎన్నుకొని వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని తన 32వ చిత్రం వివరాలు గురువారం ప్రకటించారు. ‘హిట్ 3’ చిత్రంలో తన లుక్‌ని, గ్లింప్స్‌ను విడుదల చేశారు. డాక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకుడు. ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. సిగార్ తాగుతూ, కారు నడుపుతూ రక్తపు చేతులు, గొడ్డలితో ఫెరోషియస్‌గా కనిపించారు నాని. ‘హిట్ 3’లో ఆయన అర్జున్ సర్కార్‌గా కనిపించబోతున్నారు. ఈ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని దర్శకుడు చెప్పారు. 2025 వేసవి సందర్బంగా మే ఒకటిన సినిమాను విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. ‘హిట్ 3’ చిత్రానికి సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహణాన్ని, మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.