టికెట్‌ ధరల పెంపుపై సీఎంతో పవన్‌ చర్చిస్తానన్నారు

ABN , Publish Date - Jul 06 , 2024 | 05:34 AM

కొత్త సినిమాలు విడుదలైన ప్రతిసారీ టికెట్‌ ధర పెంచాలని ప్రభుత్వాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా శాశ్వత ప్రాతిపదికన ఓ విధానం తీసుకురావాలనేదే ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అభిమతమని నిర్మాత సి. అశ్వనీదత్‌ అన్నారు. టికెట్‌ ధరల పెంపు అంశం గురించి

- సి. అశ్వనీదత్‌

కొత్త సినిమాలు విడుదలైన ప్రతిసారీ టికెట్‌ ధర పెంచాలని ప్రభుత్వాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా శాశ్వత ప్రాతిపదికన ఓ విధానం తీసుకురావాలనేదే ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అభిమతమని నిర్మాత సి. అశ్వనీదత్‌ అన్నారు. టికెట్‌ ధరల పెంపు అంశం గురించి ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో వెలిబుచ్చిన అభిప్రాయాలపై కొన్ని అపోహలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సోషల్‌ మీడియా వేదికగా వాటిపై అశ్వనీదత్‌ స్పష్టత నిచ్చారు. ‘బడ్జెట్‌ను బట్టి టికెట్‌ ధరలు ఎంతవరకూ పెంచవచ్చు, అలాగే ధరల పెంపు పది రోజులా?, వారమా? అనేది నిర్మాతలంతా కూర్చోని, చర్చించుకొని వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారితో స్వయంగా చర్చిస్తానని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు’ అని తెలిపారు. నిర్మాతలకు అండగా ఉంటానని ప్రేక్షకులకూ, పరిశ్రమ వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని కలసికట్టుగా తీసుకుందాం అని పవన్‌ కల్యాణ్‌ భరోసా ఇచ్చారని అశ్వనీదత్‌ ప్రకటనలో తెలిపారు.

Updated Date - Jul 06 , 2024 | 05:34 AM