Thufaanu Hecharika: ‘తుఫాను హెచ్చరిక’.. అల్లు పేరుతో మరో హీరో ఎంట్రీ..

ABN , Publish Date - Jun 10 , 2024 | 09:13 PM

శ్రీ పాద క్రియేషన్స్ పతాకంపై అల్లు రామకృష్ణ మరియు సుహానా ముద్వారి హీరోహీరోయిన్లుగా.. జగదీష్ కెకె దర్శకత్వంలో డాక్టర్ శ్రీనివాస్ కిషన్ అనాపు, డాక్టర్ రజనీకాంత్ ఎస్, సన్నీ బన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘తుఫాను హెచ్చరిక’. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Thufaanu Hecharika: ‘తుఫాను హెచ్చరిక’.. అల్లు పేరుతో మరో హీరో ఎంట్రీ..
Thufaanu Hecharika First Look

శ్రీ పాద క్రియేషన్స్ పతాకంపై అల్లు రామకృష్ణ (Allu Ramakrishna) మరియు సుహానా ముద్వారి (Suhana Mudwari) హీరోహీరోయిన్లుగా.. జగదీష్ కెకె (Jagadish KK) దర్శకత్వంలో డాక్టర్ శ్రీనివాస్ కిషన్ అనాపు, డాక్టర్ రజనీకాంత్ ఎస్, సన్నీ బన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘తుఫాను హెచ్చరిక’. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. (Thufaanu Hecharika Movie First Look)

ఈ సందర్భంగా దర్శకుడు జగదీష్ కె కె మాట్లాడుతూ.. ‘‘ మా ‘తుఫాను హెచ్చరిక’ మొదటి పోస్టర్‌ను విడుదల చేశాం. మంచి స్పందన వస్తోంది. ఇది ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఒక అందమైన హిల్ స్టేషన్‌లో ఆహ్లాదంగా జీవించే ఒక అబ్బాయి జీవితంలోకి ఒక తుఫాను లాంటి విధ్వంసం జరిగితే, ఆ పరిస్థితులని ఆ అబ్బాయి ఎలా ఎదుర్కొన్నాడు మరియు ఎలా విజయం సాధించాడు అనేదే ఈ చిత్ర కథ. ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాటిక్ విజన్‌కు పనిచేసిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు ప్రాణం పోశారు. ఆ ఆర్టిస్ట్స్ అందరూ అతి తక్కువ ఉష్ణోగ్రతలలో, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అద్భుతంగా నటించారు. లంబసింగి మరియు చింతపల్లి లాంటి అందమైన లొకేషన్స్‌లో ప్రకృతి అందాల్లో సరైన విజువల్ కోసం ఏడాది కాలం ఓపికగా వేచి ఉండి మరీ చిత్రీకరించడం జరిగింది.


Thufaanu-Hecharika.jpg

హిల్ స్టేషన్‌లో ఉండే ఆ ఫ్రెష్‌నెస్ స్పష్టంగా ఫీల్ అయ్యేలా చేసిన మా సినిమాటోగ్రాఫర్ ఆర్ కె నాయుడు‌కి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ ప్రాజెక్ట్ పట్ల నా అభిరుచిని పంచుకుని చిత్రీకరణలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సపోర్ట్ చేసిన మా నిర్మాతలు డా.శ్రీనివాస్‌ కిషన్‌, డా.రజనీకాంత్‌, సన్నీ బన్సల్‌‌లకి నా కృజ్ఞతలు. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్, మ్యూజిక్, మిగిలిన అన్ని క్రాఫ్ట్‌ల వారికి ధన్యవాదాలు. ప్రస్తుతం షూటింగ్ అంతా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని తెలిపారు.

Updated Date - Jun 10 , 2024 | 09:17 PM