ప్రభాస్‌ చేతుల మీదుగా...

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:52 AM

సుహాస్‌ నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘జనక అయితే గనక’. సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకోగా...

సుహాస్‌ నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘జనక అయితే గనక’. సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకోగా.. గురువారం ప్రభాస్‌ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ‘పిల్లల్ని కనాలంటే చేతినిండా డబ్బులుండాలి.. పిల్లలకు బెస్ట్‌ ఇవ్వలేనప్పుడు వారిని కనకూడదు’ అని ఆలోచించే మనస్తత్వం ఉన్న మధ్య తరగతి వ్యక్తి క్యారెక్టర్‌లో సుహాస్‌ నటించారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌, గోపరాజు రమణ, సంగీత్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: కోదాటి పవన్‌ కల్యాణ్‌, డీఓపీ: సాయిశ్రీరామ్‌, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అకుల్‌.======

Updated Date - Jul 05 , 2024 | 12:52 AM