మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా...

ABN , Publish Date - Jun 16 , 2024 | 05:12 AM

సదన్‌ హీరోగా పరిచయమౌతున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. ప్రియాంక ప్రసాద్‌ హీరోయిన్‌. పి.ఎల్‌.విఘ్నేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు, పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను...

మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా...

సదన్‌ హీరోగా పరిచయమౌతున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. ప్రియాంక ప్రసాద్‌ హీరోయిన్‌. పి.ఎల్‌.విఘ్నేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు, పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ‘‘ఇటువంటి ఫీల్‌ గుడ్‌ చిత్రాలు తీస్తున్నందుకు చిత్రబృందాన్ని అభినందిస్తున్నాను. ఈ మూవీ టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అని చెప్పారు. ఈ చిత్రానికి డీఓపీ: ఈదర ప్రసాద్‌, సంగీతం: మార్కండేయ.

Updated Date - Jun 16 , 2024 | 05:12 AM