థ్రిల్లింగ్‌ భైరవకోన

ABN , Publish Date - Jan 31 , 2024 | 01:44 AM

సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘ఊరిపేరు భైరవకోన’. వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో రాజేశ్‌ దండా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు...

థ్రిల్లింగ్‌ భైరవకోన

సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘ఊరిపేరు భైరవకోన’. వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో రాజేశ్‌ దండా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సందీప్‌కిషన్‌ మంత్రదండం పట్టుకుని కనిపించారు. అతని వెనుక హీరోయిన్స్‌ కనిపించారు. ప్రచార చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని, సినిమా కూడా అందరికీ నచ్చుతుందని మేకర్స్‌ నమ్మకం వ్యక్తం చేశారు. వెండితెరపై ఇప్పటివరకూ చూడని థ్రిలింగ్‌ అంశాలు ఈ సినిమాలో ఉంటాయని వారు చెప్పారు. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: నందు సవిరిగాన, కెమెరా: రాజ్‌ తోట, సంగీత: శేఖర్‌ చంద్ర.

Updated Date - Jan 31 , 2024 | 01:44 AM