మూడేళ్లు.. ఏడు ప్లాపులు.. రూ.800 కోట్ల నష్టం!

ABN , Publish Date - Jun 29 , 2024 | 03:26 AM

చిత్రపరిశ్రమలో ఎప్పుడూ సక్సె్‌సదే పై చేయి. వ్యాపారంతో కూడుకున్న కళారంగం కనుక డిమాండ్‌ లేని నటుల జోలికి ఎవరూ వెళ్లరు. ప్లాపుల్లో ఉన్నవారిని పట్టించుకోరు. కానీ ఈ విషయంలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌కు....

మూడేళ్లు.. ఏడు ప్లాపులు.. రూ.800 కోట్ల నష్టం!

చిత్రపరిశ్రమలో ఎప్పుడూ సక్సె్‌సదే పై చేయి. వ్యాపారంతో కూడుకున్న కళారంగం కనుక డిమాండ్‌ లేని నటుల జోలికి ఎవరూ వెళ్లరు. ప్లాపుల్లో ఉన్నవారిని పట్టించుకోరు. కానీ ఈ విషయంలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌కు మినహాయింపు ఇవ్వాలి. నలభై ఏళ్ల సుదీర్ఘమైన నట జీవితం ఆయనది. పదేళ్లుగా అత్యధిక పారితోషికం అందుకొంటున్న హీరోల జాబితాలో ఆయన పేరు ఉంటోంది. అయితే మూడేళ్ల నుంచి అక్షయ్‌ను వరుస అపజయాలు వెంటాడుతున్నాయి. ఏడు సినిమాలు.. ‘బచ్చన్‌ పాండే’, ‘సమ్రాట్‌ పృథ్వీరాజ్‌’, ‘రక్షాబంధన్‌’, ‘రామ్‌సేతు’, ‘సెల్ఫీ’, ‘మిషన్‌ రాణీగంజ్‌’, ‘బడేమియా ఛోటే మియా’.. బాక్సఫీసు దగ్గర బోల్తా పడ్డాయి. వీటిల్లో ‘సమ్రాట్‌ పృథ్వీరాజ్‌’, ‘బడేమియా ఛోటేమియా’ చిత్రాలైతే ఇండియన్‌ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్‌ ఫ్లాప్స్‌. ఈ ఏడు చిత్రాల వల్ల దాదాపు రూ.800 కోట్లు చిత్ర పరిశ్రమ నష్టపోయిందని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు.


ఇంత ప్లాపుల చరిత్ర ఉన్న నటుడిని పరిశ్రమ పట్టించుకోకూడదు. కానీ అక్షయ్‌ ప్రత్యేకతే వేరు. ఆయనకు డిమాండ్‌ తగ్గలేదు. నిర్మాతలు వెంటబడుతూనే ఉన్నారు. రాబోయే రెండేళ్ల కాలంలో అక్షయ్‌ నటించిన పది చిత్రాలు విడుదల కానున్నాయి. వీటిల్లో తెలుగు సినిమా ‘కన్నప్ప’ కూడా ఉంది. అందుకే అక్షయ్‌ అదృష్టవంతుడు అంటున్నారంతా.

Updated Date - Jun 29 , 2024 | 03:26 AM