ఒకే సంస్థలో మూడు సినిమాలు

ABN , Publish Date - Nov 09 , 2024 | 06:29 AM

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ మరో రెండు చిత్రాలకు పచ్చజెండా ఊపారు. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ బేనర్‌లో ఆయన ఈ రెండు సినిమాలను చేయబోతున్నారు.

Pan India star Prabhas

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ మరో రెండు చిత్రాలకు పచ్చజెండా ఊపారు. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ బేనర్‌లో ఆయన ఈ రెండు సినిమాలను చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సలార్‌ 2’ చిత్రం కూడా ఇదే బేనర్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో కలిపితే ప్రభా్‌స-హోంబలే కాంబినేషన్‌లో మొత్తం మూడు చిత్రాలు రానున్నాయి. ‘‘సలార్‌ 2’ పూర్తవ్వగానే ఈ రెండు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. హోంబలే అధినేత విజయ్‌ కిరగందూర్‌ మాట్లాడుతూ ‘ప్రభా్‌సతో కలసి మరపురాని చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ‘సలార్‌ 2’ షూటింగ్‌ మొదలైంది. భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తినిచ్చేలా ఈ సినిమాలు ఉండబోతున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోదం పంచే దిశగా మా నిర్మాణ సంస్థ వేస్తున్న గొప్ప ముందడుగు ఇది’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం హోంబలే సంస్థ ‘సలార్‌ 2’, ‘కాంతార 2’, ‘కేజీఎఫ్‌ 3’ చిత్రాలను నిర్మిస్తోంది. ప్రభాస్‌ ప్రస్తుతం ‘రాజాసాబ్‌’, ‘స్పిరిట్‌’, ‘యానిమల్‌ పార్క్‌’తో పాటు హనూ రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.

Updated Date - Nov 09 , 2024 | 06:29 AM