ముద్దు సీన్‌కు మూడు కట్స్‌

ABN , Publish Date - Jul 17 , 2024 | 06:24 AM

‘యానిమల్‌’ సినిమాలో బోల్డ్‌ సీన్స్‌లో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించిన హాట్‌ గర్ల్‌ త్రిప్తి దిమ్రీ నటించిన తాజా చిత్రం ‘బ్యాడ్‌ న్యూజ్‌’. విక్కీ కౌశల్‌ హీరోగా నటించిన ఈ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌...

‘యానిమల్‌’ సినిమాలో బోల్డ్‌ సీన్స్‌లో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించిన హాట్‌ గర్ల్‌ త్రిప్తి దిమ్రీ నటించిన తాజా చిత్రం ‘బ్యాడ్‌ న్యూజ్‌’. విక్కీ కౌశల్‌ హీరోగా నటించిన ఈ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఈ నెల 19న విడుదల కానుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో హీరోహీరోయిన్ల మధ్య ముద్దు సీన్లు మూడు ఉన్నాయట. ఈ మధ్యకాలంలో కిస్సింగ్‌ సీన్లను చూసీ చూడనట్లు వదిలేస్తున్న సెన్సార్‌ వారు ‘బ్యాడ్‌ న్యూజ్‌’ చిత్రం మీద కన్నెర్ర చేసి, కత్తెరకు పని చెప్పారట. విక్కీ, త్రిప్తి పై చిత్రీకరించిన ముద్దు సీన్లు మోతాదు మించి ఉన్నాయనీ, తగ్గించాలని సెన్సారు అధికారి చెప్పడంతో చేసేదేమీ లేక వాటిని తగ్గించి విడుదల చేస్తున్నారు. త్రిప్తి అభిమానులకు ఇది బ్యాడ్‌ న్యూసే కదూ!

Updated Date - Jul 17 , 2024 | 06:24 AM