ఆలోచనలే మన శత్రువులు

ABN, Publish Date - Jul 23 , 2024 | 05:50 AM

వెంకట సత్య దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌’. ‘పలాస 1978’ ఫేమ్‌ రక్షిత్‌ అట్లూరి, సంగీర్తన విపిన్‌ జంటగా నటించారు. ఈ న్యూ ఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను ధ్యాన్‌ అట్లూరి నిర్మించారు...

వెంకట సత్య దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌’. ‘పలాస 1978’ ఫేమ్‌ రక్షిత్‌ అట్లూరి, సంగీర్తన విపిన్‌ జంటగా నటించారు. ఈ న్యూ ఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను ధ్యాన్‌ అట్లూరి నిర్మించారు. ఈ నెల 26న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకట సత్య మీడియాతో ముచ్చటించారు.

‘‘మన ఆలోచనలే మన శత్రువులు అన్నది ఈ సినిమా కథకు మూలం. ఈ పాయింట్‌ను నేను పురాణాల్లోంచి తీసుకున్నాను. ఈ సినిమా ఒక మనిషి ఎలా సైకోగా మారతాడో విజువల్‌గా చూపిస్తుంది. సినిమాలోని ప్రతీ పాత్రకూ విశిష్టత ఉంటుంది. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ చూడని అంశాలు ‘ఆపరేషన్‌ రావణ్‌’లో ఉంటాయి. ఈ సినిమాను ప్రేక్షకులు చాలా బాగా రిసీవ్‌ చేసుకుంటారనే నమ్మకం ఉంది. ఇందులో మా అబ్బాయి రక్షిత్‌ స్టంట్స్‌ చేసేటప్పుడు ఒక తండ్రిగా భయపడ్డాను..


డైరెక్టర్‌గా జాగ్రత్తపడ్డాను. రక్షిత్‌ ఈ క్యారెక్టర్‌ను బాగా ఓన్‌ చేసుకున్నాడు. తన కష్టం స్ర్కీన్‌పై మంచి ఫలితాన్ని ఇస్తుంది. రాధిక పోషించిన పాత్ర.. చాలా కాలం పాటూ గుర్తుండిపోయేలా ఉంటుంది. సినిమాలోని ప్రతీ సన్నివేశం ప్రేక్షకులను ఆశ్యర్చపరుస్తుంది. అన్ని విభాగాల నుంచి మంచి అవుట్‌పుట్‌ వచ్చింది’’ అని చెప్పారు.

Updated Date - Jul 23 , 2024 | 05:50 AM