ఈ విజయం ఎంతో ఆనందాన్నిస్తోంది

ABN , Publish Date - Jun 16 , 2024 | 05:10 AM

సుధీర్‌బాబు నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘హరోంహర’. మాళవిక శర్మ ఇందులో హీరోయిన్‌గా నటించారు. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై హిట్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద...

ఈ విజయం ఎంతో ఆనందాన్నిస్తోంది

సుధీర్‌బాబు నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘హరోంహర’. మాళవిక శర్మ ఇందులో హీరోయిన్‌గా నటించారు. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై హిట్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సుబ్రమణ్యం.జి, సుమంత్‌ నాయుడు.జి మీడియాతో ముచ్చటించారు. ‘‘ఈ సినిమా కథ వినగానే తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌, కథానాయకుడి పాత్ర నన్ను బాగా ఆకర్షించాయి. వెంటనే సినిమాను నిర్మించడానికి ఒప్పుకున్నా. ఈ సినిమా విజయం ఎంతో ఆనందాన్నిస్తోంది. విడుదలైన అన్ని చోట్లా థియేటర్లు నిండిపోవడం చూసి ఎంతో ఆనందంగా ఉంది. మంచి సినిమా తీశామని ప్రేక్షకులు, మిత్రులు, ఇండస్ట్రీ పెద్దలు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. ప్రస్తుతం మూడు నాలుగు చిత్రాలు నిర్మిస్తున్నాం. వాటి గురించి త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తాము’’ అని చెప్పారు.

Updated Date - Jun 16 , 2024 | 05:10 AM