ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదు

ABN , Publish Date - May 07 , 2024 | 05:52 AM

‘హుషారు’, ‘జాంబీ రెడ్డి’, ‘రావణాసుర’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు దక్షా నగార్కర్‌. తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా దక్షా నటించింది కేవలం ఐదు చిత్రాలు మాత్రమే. ఇటీవలే ఆమె కొన్ని...

ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదు

‘హుషారు’, ‘జాంబీ రెడ్డి’, ‘రావణాసుర’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు దక్షా నగార్కర్‌. తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా దక్షా నటించింది కేవలం ఐదు చిత్రాలు మాత్రమే. ఇటీవలే ఆమె కొన్ని అనారోగ్య సమస్యలతో హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. కోలుకున్నాక ఈ విషయమై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘గడిచిన కొద్ది రోజులు నరకప్రాయంగా తోచాయి. ఇలా ఆస్పత్రి బెడ్‌లో చికిత్స పొందుతూ ఉండటం ఎంతో బాధాకరం. నా వెన్నెముకకు ఇప్పటికే రెండు సార్లు మత్తు మందు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదు. ఈ పరిస్థితుల నుంచి కోలుకోవడం ఎంతో కష్టంగా ఉన్నా.. కుటుంబ సభ్యుల అభిమానం, కేరింగ్‌ ఆరోగ్యాన్ని మెల్లిమెల్లిగా కుదుటపడేలా చేస్తున్నాయి. వారు కురిపించిన ప్రేమ వల్ల ఎంతటి నొప్పినైనా భరించే శక్తి వచ్చింది. కంటికి కనిపించని గాయాలను మాయం చేసే అద్భుత గుణం ప్రేమకు ఉంది. కుటుంబ సభ్యుల ప్రేమ ఈ విషయాన్ని రుజువు చేసింది. నేను అందరికీ చెప్పేదొక్కటే.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగే మీ చుట్టూ పాజిటివ్‌ వైబ్స్‌ను పెంచే రిలేషన్స్‌తో ఎక్కువ సమయం గడపండి’’ అని పేర్కొన్నారు.

Updated Date - May 07 , 2024 | 05:52 AM