ఈ ప్రశంసలు ఊహించలేదు

ABN , Publish Date - Jun 14 , 2024 | 03:33 AM

వంశీ జొన్నలగడ్డ దర్శకత్వంలో నూతన నటీనటులతో రూపొందిన చిత్రం ‘నీ దారే నీ కథ’. ప్రియతమ్‌ మంతిని, విజయ విక్రాంత్‌, అనంత పద్మశాల, వేద్‌, అంజన బాలాజీ ప్రధాన పాత్రల్లో నటించారు...

ఈ ప్రశంసలు ఊహించలేదు

వంశీ జొన్నలగడ్డ దర్శకత్వంలో నూతన నటీనటులతో రూపొందిన చిత్రం ‘నీ దారే నీ కథ’. ప్రియతమ్‌ మంతిని, విజయ విక్రాంత్‌, అనంత పద్మశాల, వేద్‌, అంజన బాలాజీ ప్రధాన పాత్రల్లో నటించారు. వంశీ జొన్నలగడ్డ, తేజేష్‌ వీర, శైలజ జొన్నలగడ్డ నిర్మించారు. నేడు సినిమా విడుదలవుతోన్న సందర్భంగా ప్రీమియర్‌ షో ఏర్పాటు చేశారు. ఈ షో ముగిశాక డైరెక్టర్‌ వంశీ మాట్లాడుతూ ‘‘సంగీతంలో అనుకున్నది సాధించడం కోసం నలుగురు యువకులు చేసే ప్రయత్నాల్ని అందర్నీ ఆకట్టుకునేలా, ఎంతో ఆసక్తికరంగా చూపించారని.. ప్రీమియర్‌లో సినిమాను చూసిన ప్రేక్షకులందరూ ప్రశంసిస్తున్నందుకు ఆనందంగా ఉంది. అందరూ సినిమాను ఇంతగా ఆదరిస్తారని అస్సలు ఊహించలేదు. థియేటర్లలోనూ ప్రేక్షకులు ఇదే విధంగా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

Updated Date - Jun 14 , 2024 | 03:33 AM