ఈ చిత్రం.. నాకెంతో ప్రత్యేకం
ABN , Publish Date - Oct 22 , 2024 | 02:23 AM
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ నెల 31న సినిమా...
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ నెల 31న సినిమా విడుదలవుతోంది. సోమవారం ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం.. నాకెంతో ప్రత్యేకం. ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి డబ్బు కోసం ఏం చేశాడు అనేది చాలా ఆసక్తికరంగా చూపించాం. వినోదంతో పాటు భావోద్వేగాలు కలగలిసిన చిత్రమిది. సినిమా మీ అందరికీ తప్పక నచ్చుతుంది. కుటుంబమంతా కలసి చూడవలసిన చిత్రమిది’’ అని చెప్పారు. ‘‘సినిమాలో ప్రతీ సన్నివేశం కొత్తగా ఉంటుంది’’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. ‘‘ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ఈ సినిమాలో పోషించిన సుమతి రోల్ నాకు చాలా ఇష్టం’’ అని హీరోయిన్ మీనాక్షీ చౌదరి చెప్పారు.