ఈ సినిమానే నా ఫేవరెట్‌

ABN , Publish Date - May 21 , 2024 | 06:13 AM

‘సత్యభామ’ సినిమాతో పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో ప్రేక్షకులని పలకరించడానికి సిద్ధమయ్యారు కాజల్‌ అగర్వాల్‌. నవీన్‌ చంద్ర, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రల్లో నటించిన...

ఈ సినిమానే నా ఫేవరెట్‌

‘సత్యభామ’ సినిమాతో పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో ప్రేక్షకులని పలకరించడానికి సిద్ధమయ్యారు కాజల్‌ అగర్వాల్‌. నవీన్‌ చంద్ర, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించారు. ఈ నెల 31న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగం చేసింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్యూలో కాజల్‌ మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. ‘‘దర్శకుడు చెప్పిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ విన్నవెంటనే ఆకట్టుకుంది. నేను ప్రస్తుతం నటించిన ‘సత్యభామ’ సినిమానే నా సినిమాల్లో ఫేవరెట్‌. ఎవరైనా సరే వారు ప్రస్తుతం నటించిన చిత్రాన్నే ఇష్టపడాలి. అందుకే నాకు ఈ సినిమానే నా ఫేవరెట్‌. ఈ సినిమా కోసం నేను మొదటిసారి పోలీసు పాత్రలో కనిపిస్తున్నా. తెరపై కొత్త కాజల్‌ను ఈ సినిమాతో చూస్తారు’’ అని చెప్పారు.

Updated Date - May 21 , 2024 | 06:13 AM