ఈ తల్లి శాపం తగిలి తీరుతుంది

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:13 AM

తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని మీమ్స్‌తో ట్రోల్‌ చేస్తున్నవారిపై నటుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య, నటి రేణూదేశాయ్‌ మండిపడ్డారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత...

ఈ తల్లి శాపం తగిలి తీరుతుంది

  • ట్రోలర్స్‌పై మండిపడ్డ రేణూదేశాయ్‌

తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని మీమ్స్‌తో ట్రోల్‌ చేస్తున్నవారిపై నటుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య, నటి రేణూదేశాయ్‌ మండిపడ్డారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తన శ్రీమతి అన్నా లెజినోవా, తనయుడు అకిరానందన్‌, కూతురు ఆద్యలతో దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆ ఫొటోను వాడుకొని కొందరు రేణూదేశాయ్‌ వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తూ రకరకాల మీమ్స్‌ రూపొందించారు. పవన్‌ కల్యాణ్‌తో విడాకులు తీసుకోని పొరపాటు చేశారనీ, అదృష్టాన్ని కాలదన్నుకున్నారనీ రకరకాల వ్యాఖ్యలతో మీమ్స్‌ పెడుతున్నారు. అవి తమను ఎంతగానో బాధపెడుతున్నాయని రేణూదేశాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ‘మనుషులు ఇంత దారుణంగా దిగజారడం సిగ్గు చేటు. నాపై వస్తున్న విమర్శలు, నన్నుఎగతాళి చేస్తున్న తీరు చూసి నా కూతురు ఆద్య కన్నీరు పెట్టుకుంది.


మీమ్స్‌ చేసేవాళ్లంతా గుర్తుంచుకోండి, మీకూ ఓ కుటుంబం ఉంటుంది, తల్లులూ, అక్కచెల్లెళ్లు ఉన్నారు. మాపైన జోక్స్‌ చేస్తున్నవాళ్లకు ఈ తల్లి శాపం తగిలి తీరుతుంది. నా బిడ్డ కార్చిన కన్నీరు, ఊరకే పోదు. ఈ తల్లి శాపం తగిలితీరుతుంది. దీన్ని పోస్ట్‌ చేసేముందు వంద సార్లు ఆలోచించాల్సి వచ్చింది. కానీ తప్పలేదు’ అని రేణూదేశాయ్‌ తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నారు.

Updated Date - Jun 27 , 2024 | 12:13 AM