ఇక్కడే నా జీవితం మొదలైంది

ABN , Publish Date - Jun 28 , 2024 | 04:23 AM

ఒక పక్క అల్లు అర్జున్‌, ఇంకో పక్క ధనుష్‌, ఆ పక్క సల్మాన్‌ఖాన్‌. ఇవీ కాకుండా జూనియర్‌ ఎన్టీఆర్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ చిత్రంలోనూ, ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ సినిమాలోనూ ఆమె హీరోయిన్‌ అంటున్నారు...

ఇక్కడే నా జీవితం మొదలైంది

ఒక పక్క అల్లు అర్జున్‌, ఇంకో పక్క ధనుష్‌, ఆ పక్క సల్మాన్‌ఖాన్‌. ఇవీ కాకుండా జూనియర్‌ ఎన్టీఆర్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ చిత్రంలోనూ, ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ సినిమాలోనూ ఆమె హీరోయిన్‌ అంటున్నారు. అలాగే ‘గర్ల్‌ఫ్రెండ్‌’ పేరుతో చేస్తున్న లేడీ ఓరియంటెట్‌ సినిమా ఉండే ఉంది. ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో రష్మిక హవా మాములుగా లేదు. ఇంత బిజీగా ఉన్న ఆమె తీరిక చేసుకుని చిన్ననాటి స్నేహితురాలు వివాహానికి తను పుట్టి పెరిగిన ఊరు ‘కొడగు’ వెళ్లింది. కర్నాటక రాష్ట్రంలోని ఆ ప్రాంతానికి వెళ్లగానే బాల్య స్మృతులు ఒక్కసారిగా చుట్టముట్టడంతో భావోద్వేగానికి లోనయ్యారు. ‘కొడగు.. నా హృదయం, నా చరిత్ర. జీవితం ఇక్కడే మొదలైంది’ అంటూ ఈ సందర్భంగా దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. చిన్ననాటి స్నేహితురాళ్లను కలుసుకొని ఆ నాటి ముచ్చట్లను గుర్తు చేసుకుని మురిసిపోయింది.

Updated Date - Jun 28 , 2024 | 04:23 AM