ఇది బుల్లెట్‌ తెచ్చిన సక్సెస్‌

ABN , Publish Date - Apr 29 , 2024 | 06:41 AM

రవి వర్మ, సంజనా సింగ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బుల్లెట్‌’. చౌడప్ప దర్శకత్వం వహించారు. ఎంసి రావు, బి గోపాల్‌, ఎమ్‌ వి మల్లిఖార్జున రావు, కోసూరి సుబ్రమణ్యం, మని నిర్మించారు...

ఇది బుల్లెట్‌ తెచ్చిన సక్సెస్‌

రవి వర్మ, సంజనా సింగ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బుల్లెట్‌’. చౌడప్ప దర్శకత్వం వహించారు. ఎంసి రావు, బి గోపాల్‌, ఎమ్‌ వి మల్లిఖార్జున రావు, కోసూరి సుబ్రమణ్యం, మని నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం చక్కటి ప్రేక్షకాదరణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేసింది. దర్శకుడు చౌడప్ప మాట్లాడుతూ ‘‘మంచి చిత్రాలను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ఈ చిత్రం సాధించిన విజయంతో మరోసారి రుజువైంది’’ అని చెప్పారు. చిత్ర నిర్మాత గోపాల్‌ మాట్లాడుతూ ‘‘ఈ మూవీ కోసం టీమ్‌ అంతా ఎంతో కష్టపడింది. ఈ విజయం మా కష్టానికి తగిన ప్రతిఫలం’’ అని అన్నారు. హీరో రవి వర్మ మాట్లాడుతూ ‘‘ఈ కాలంలో ఓ సినిమా విజయోత్సవ వేడుక జరుపుకోవడం అరుదు. అలాంటి భాగ్యాన్ని మాకు అందించిన ప్రేక్షకులకు రుణపడి ఉంటాం’’ అని అన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 06:41 AM