ఇది నా అదృష్టం

ABN , Publish Date - Jun 11 , 2024 | 05:09 AM

‘సీతయ్య’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘దేవదాసు’ వంటి బ్లాక్‌బస్టర్స్‌కు దర్శకత్వం వహించిన డైరెక్టర్‌ వై.వీ.ఎ్‌స.చౌదరి. దాదాపు 9 ఏళ్ల గ్యాప్‌ తర్వాత ఆయన ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు

ఇది నా అదృష్టం

‘సీతయ్య’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘దేవదాసు’ వంటి బ్లాక్‌బస్టర్స్‌కు దర్శకత్వం వహించిన డైరెక్టర్‌ వై.వీ.ఎ్‌స.చౌదరి. దాదాపు 9 ఏళ్ల గ్యాప్‌ తర్వాత ఆయన ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వై.వీ.ఎ్‌స.చౌదరి సతీమణి యలమంచలి గీత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సోమవారం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ఆయన ప్రకటించారు. ఇంకా టైటిల్‌ ఖరారు కాని ఈ చిత్రంతో నందమూరి జానకిరామ్‌ తనయుడు నందమూరి తారకరామారావు కథానాయకుడిగా పరిచయమౌతున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ వై.వీ.ఎ్‌స.చౌదరి మాట్లాడుతూ ‘‘మంచి కథతో మీ ముందుకు వస్తున్నాను. నందమూరి వంశం నుంచి నాలుగో తరానికి చెందిన నటుడ్ని పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. నిజానికి ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. నా ప్రతీ సినిమాలాగే ఇందులోనూ సంగీతానికి, సాహిత్యానికి పెద్దపీట ఉంటుంది. త్వరలోనే ఈ సినిమాలోని హీరోని, హీరోయిన్‌ను, మిగతా చిత్ర బృందాన్ని పరిచయం చేస్తాను’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రమేశ్‌ అత్తిలి.

Updated Date - Jun 11 , 2024 | 05:09 AM