ఇది సినిమా కాదు జీవితం

ABN , Publish Date - Jun 14 , 2024 | 03:34 AM

అజయ్‌ఘోష్‌, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’. శివ పాలడుగు దర్శకత్వం వహించగా, జి.హర్ష, జి.రంగారావు నిర్మించారు. నేడు సినిమా విడుదలవుతున్న...

ఇది సినిమా కాదు జీవితం

అజయ్‌ఘోష్‌, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’. శివ పాలడుగు దర్శకత్వం వహించగా, జి.హర్ష, జి.రంగారావు నిర్మించారు. నేడు సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అజయ్‌ఘోష్‌ మాట్లాడుతూ ‘‘జీవితంలో ఏదో సాధించాలని అనుకునే వారికి.. ఏదో సాధించాలనుకొని ఆగిపోయిన వారికీ ఈ సినిమా విపరీతంగా కనెక్ట్‌ అవుతుంది. ఇది సినిమా కాదు జీవితం’’ అని అన్నారు. ‘‘కల కనడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించే చిత్రమిది’’ అని చాందినీ చౌదరి చెప్పారు.

Updated Date - Jun 14 , 2024 | 03:34 AM